
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న నయా మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా పై అంచనాలు పెంచేశారు మేకర్స్. గతంలో నెల్సన్ దిలీప్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించారు. బీస్ట్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు నెల్సన్. దాంతో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమానుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్నాయి. అలాగే ఈ సినిమానుంచి రిలీజ్ అయినా నువ్ కావాలయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈసాంగ్ లో తమన్నా అందాలు, డాన్స్ ఆకట్టుకున్నాయి. జైలర్ సినిమాను ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మూవీ టీమ్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమాలో రజినీకాంత్ డిఫర్ట్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ ఓ పోలీస్ ఆఫీసర్ తండ్రిగా కనిపించనున్నారు. అలాగే ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. “ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలు ఉండవు.. కోతలే” అంటూ సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.