
చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ టిక్కెట్ ధరల వివాదం మరింత ముదిరింది. టిక్కెట్ ధరల పెంపునకు ఏపీ సర్కారు అనుమతి నిరాకరించడం పట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు, అనుమతి నిరాకరణకు సంబంధం లేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టంచేశారు. భోళా శంకర్ మూవీకి సంబంధించి 12 అంశాలపై ఆగస్టు 2న వివరణ కోరామని.. అయితే దీనికి ఇప్పటి వరకు సమాధానం రాలేదని చెప్పారు. అయితే చిరంజీవి ఆగస్టు 8న వ్యాఖ్యలు చేశారని అన్నారు.
అలాగే సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి అపారమైన ప్రేమ ఉందని మంత్రి అన్నారు. వ్యక్తిగతమైన ఆలోచనలు తమ ప్రభుత్వంలో ఉండవని వ్యాఖ్యానించారు. భోళా శంకర్ మూవీ టిక్కెట్ పెంపునకు అనుమతి నిరాకరించడంపై ఏపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలను ఈ వీడియోలో చూడండి..