
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాముడి అవతారంలో అభిమానులను కనువిందు చేసిన సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీలో కృతిసనన్ జానకిగా నటించింది. భారీ అంచనాలతో జూన్ 16న థియేటర్లలో విడులైన ఆదిపురుష్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ రామాయాణానికి భిన్నంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అలాగే సినిమాలోని వీఎఫ్‌ఎక్స్, కొన్ని డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలను ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఇంత నెగెటివ్ టాక్‌లోనూ ఏకంగా రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఆదిపురుష్. ప్రభాస్‌కున్న క్రేజే దీనికి కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లలో సినిమా రిలీజై రెండు నెలలు గడుస్తున్నా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సైలెంట్‌గా ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా శుక్రవారం (ఆగస్టు 11) అర్ధరాత్రి నుంచి ఆదిపురుష్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే..
ఆదిపురుష్ సినిమాలో లంకేశుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడు, దేవ్‌దత్తా నాగే హనుమంతుడి పాత్రలు పోషించారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేశాయి. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, అజయ్ అతుల్, సంచిత్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి తరించండి.
ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్స్
We are ready to unleash the full songs thread
#Prabhas #Adipurush pic.twitter.com/PzHOCmBwaC
— Prabhas Cuts (@PrabhasHDCuts) August 10, 2023
This bgm & words Haunts me
#Prabhas #Adipurush pic.twitter.com/ENVv92HfH4
— BujjiGADU
(@TeamBujjigadu) August 10, 2023
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(@TeamBujjigadu)