Most Recent

Salaar: సలరక కజఎఫ సనమక లక..? టజర రలజ అననసమటల ఇద గమనచర..

Salaar: సలార్‌కు కేజీఎఫ్ సినిమాకు లింక్..? టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌లో ఇది గమనించారా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులను కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ స్టిల్స్ ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.

జులై 6న ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్థామని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే మాములుగా సినిమా టీజర్ లు ఉదయం 9 గంటల తర్వాత రిలీజ్ చేస్తుంటారు.. కానీ సలార్ టీజర్ మాత్రం జులై 6న ఉదయం  5.12 గంటలకు చేయనున్నారు. అదేవిధంగా ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ టీజర్ కు కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉందని అంటున్నారు నెటిజన్స్..

యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో షిప్ పై ఎటాక్ ఉదయం 5.12 గంటలకు జరుగుతుంది. ఇప్పుడు సలార్ టీజర్ కూడా ఉదయం 5.12 గంటలకు రావడంతో ఈ రెండు సినిమాకు ఎదో లింక్ ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాకు యశ్ కేజీఎఫ్ కు ఎలాంటి లింక్ ఉంటుందో చూడాలి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.