Most Recent

Payal Rajput: మహష బబ అట చల ఇషట.. ఆ సనమల హరయనగ నన చస ఉట బగడద: పయల

Payal Rajput: మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నేను చేసి ఉంటే బాగుండేది: పాయల్

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాలో నటనతోపాటు తన గ్లామర్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత పాయల్ కు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు మంగళవారం అనే హారర్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి చెప్పుకొచ్చింది.

అలాగే ఈ అమ్మడు మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని. ఆయన నటించిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నేను చేసి ఉంటే బాగుండేది అని తెలిపింది. అయినాకీర్తిసురేష్ అద్భుతంగా చేసింది అని చెప్పుకొచ్చింది.

మహేష్ బాబుతో ఎలాగైనా నటించాలి. ఆయనతో నటించాలన్నది నా కోరిక అని తెలిపింది. మరి త్వరలోనే పాయల్ రాజ్ పుత్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.