Most Recent

Salaar: పరభస ఫయనస రడగ ఉడడ.. సలర అపడట వచచసతద. టజరక మహరత ఖరర.

Salaar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రడీగా ఉండండి.. సలార్‌ అప్‌డేట్‌ వచ్చేస్తోంది. టీజర్‌కు ముహుర్తం ఖరారు.

ఆదిపురుష్‌ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే డార్లింగ్‌ తర్వాతి సినిమా ‘సలార్‌’పై ఉన్న బజ్‌. కేజీఎఫ్‌తో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిన ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌కు మళ్లీ పర్‌ఫెక్ట్ హిట్‌ను ఇచ్చేది ప్రశాంత్‌ నీల్‌ మాత్రమేనని ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే ప్రశాంత్ నీల్ సైతం సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సలార్‌ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు గడుస్తోన్నా ఇప్పటి వరకు ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు.

దీంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ అయ్యింది. సినిమాకు సంబంధించి ఫస్ట్‌ అఫిషియల్‌ అప్‌డేట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జులైన్‌ నెలలో సలార్‌ టీజర్‌ విడుదలకానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సలార్‌ టీజర్‌ను 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతీ హాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 28వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.