Most Recent

Rocking Rakesh: లండన్ బోనాల జాతర.. సందడి చేసిన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత

Rocking Rakesh: లండన్ బోనాల జాతర.. సందడి చేసిన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత

టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అలా వచ్చిన కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. టీవీ షోలోనే కాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు రాకింగ్ రాకేష్. ఇతడు యాంకర్ జోర్దార్ సుజాత అనే యాంకర్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సుజాత బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులర్ అయ్యింది. ఇక ఈ ఇద్దరు కలిసి జబర్దస్త్ షో లో కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకొని విదేశాల్లో షికారు చేస్తున్నారు. విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ జంట లండన్లో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పెద్ద పండుగా బోనాల పండగను లండన్ లో జరుపుకున్నారు రాకేష్, సుజాత. వరంగల్ కు చెందిన ఎన్ఆర్ఐ ఫోరం అక్కడ బోనాల పండగను నిర్వహించారు.  గత పది సంవత్సరాలుగా బోనాల జాతరను నిర్వహిస్తున్నారు.

ఈ బోనాల జాతరలో పాల్గొన్నారు రాకేష్, సుజాత సుజాత. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాకింగ్ రాకేష్ కామెడీతో పాటు మిమిక్రీతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సుజాత తెలంగాణ యాసలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.