Most Recent

Mahesh Babu: రోజురోజుకు అంచనాలు పెంచేస్తోన్న మహేష్, రాజమౌళి సినిమా.. ఈసారి ఇలా ప్లాన్ చేస్తున్నారా..

Mahesh Babu: రోజురోజుకు అంచనాలు పెంచేస్తోన్న మహేష్, రాజమౌళి సినిమా.. ఈసారి ఇలా ప్లాన్ చేస్తున్నారా..

మహేష్ బాబు సినిమా అంటే మాములుగా ఉండదు.. అయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మహేష్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు ఈ ఇద్దరు. ఇక గత సినిమాలకు బిన్నంగా ఉండేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబో కోసం మహేష్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ కోసం వర్క్ షాప్ ను మొదలుపెట్టనున్నాడు గురూజీ. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి రోజుకోకవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమా పై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇస్తున్న హిట్స్ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా బాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారట. మహేష్ తో పాటు ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ నటించబోతున్నారు అని టాక్. అలాగే ఈ సినిమాను రాజమౌళి 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నడని అంటున్నారు. మరి మహేష్ సినిమాలో నటించనున్న ఆ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.