Most Recent

Kanguva: సూర్య కంగువా సినిమా స్టోరీ మన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కథ ఒక్కటేనా..?

Kanguva: సూర్య కంగువా సినిమా స్టోరీ మన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కథ ఒక్కటేనా..?

తమిళ్ స్టార్ హీరో సూర్య కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలతోనూ మెప్పిస్తున్నారు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక ఇప్పుడు సూర్య పిరియాడికల్ డ్రామా తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కంగువా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సూర్య. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. సూర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఓ యుద్ధంలో సూర్య తన సైన్యంతో అందరిని చంపినట్టు చూపించారు. అలాగే సూర్య గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ అహంకారపు రాజులా కనిపిస్తున్నారు సూర్య. ఇక ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథను మన తెలుగు సినిమా కథతో పోల్చుతున్నారు కొందరు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పిర్యాడికల్ డ్రామానే.. రెండు విభిన్నమైన కాలాల్లో జరిగే కథతో తెరకెక్కింది బింబిసార.

అయితే బింబిసార సినిమా మాదిరిగానే కంగువా సినిమాలో కూడా రెండు కాలాల్లో జరిగే సంఘటనలు ఉంటాయని టాక్. గతంలో క్రూరమైన రాజుగా ఉన్న సూర్య.. ప్రస్తుత కాలంలోకి వస్తాడని ఇక్కడి పరిస్థితులు అతడిని మార్చేస్తాయని.. ఇదే కంగువా మూవీ స్టోరీ అంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ దాదాపు బింబిసార, కంగువా సినిమాల కథ ఒకటే అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సూర్య కంగువా సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.Bimbisara

Bimbisara


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.