
ఆగస్టు 10న సిల్వర్ స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ క్లాష్ జరగనుంది. ఒకే రోజు ఒకే పేరుతో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా…?. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మెగా మల్టీస్టారర్‌గా సిద్ధం చేశారు మేకర్స్. రజనీకాంత్‌లో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ లాంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ జైలర్ ప్రమోషన్ పీక్స్‌లో ఉంది. కావలా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటే, హుకుం సాంగ్ యూట్యూబ్ వ్యూస్‌లో రికార్డ్ సెట్ చేస్తోంది. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
రజనీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ అవుతున్న అదే రోజు జైలర్ పేరుతోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్నది మలయాళంలో. ఈ మూవీ వల్ల తమిళనాట రజనీ సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినా.. మాలీవుడ్ మార్కెట్‌లో మాత్రం ఎఫెక్ట్ పడటం పక్కా అన్న టాకే వినిపిస్తోంది.
రజనీ జైలర్‌లో మోహన్‌లాల్ కూడా నటిస్తుండటంతో మలయాళ మార్కెట్ మీద కూడా గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు అదే పేరుతో మాలీవుడ్‌లో అదే రోజు మరో సినిమా రిలీజ్ అవుతుండటంతో వసూళ్ల పరంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.
Jailer Malayalam