Most Recent

Gadar-2: గదర 2 రలజక లన కలయర.. పరవయ చసన ఇడయన ఆరమ .. దశ వభజన సమయల జవన వఫల పరమ కథ అట టక..

Gadar-2: ‘గదర్ 2’ రిలీజ్‌కు లైన్ క్లియర్.. ప్రివ్యూ చూసిన ఇండియన్ ఆర్మీ .. దేశ విభజన సమయంలో జవాన్ విఫల ప్రేమ కథే అంటూ టాక్..

దేశ రక్షణ కోసం తమ కుటుంబాన్ని, ప్రాణాలు సైతం లెక్కచేయని మిలటరీ నేపథ్యంలో తెరకెక్కే కథలకు ఎప్పుడూ ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారు. ఈ నేపధ్యం తాజాగా ఆర్మీ నేపధ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం గదర్ 2. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా నటిస్తున్నారు. ‘గదర్ 2’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఈ సినిమా టీజర్‌ సినీ అభిమానులను మాత్రమే కాదు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ‘గదర్ 2’ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గదర్ సీక్వెల్ కు పోటీగా బాలీవుడ్ నుంచి మరికొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి.

మరోవైపు గద్దర్ 2 సినిమా గురించి సరికొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఆర్మీ నేపథ్యంతో తెరకెక్కుతున్నది కనుక  సన్నీ, అమీషా జంటగా నటించిన ‘గదర్ 2’ చిత్రానికి ఇండియన్ ఆర్మీ ఎన్ఓసీ ఇచ్చింది. నిజానికి మన దేశంలో ఆర్మీ ఆధారంగా తెరకెక్కించే సినిమా రిలీజ్ కు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రివ్యూ కమిటీ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఆర్మీ అంగీకారం లేకుండా సినిమా విడుదల చేయడం సాధ్యం కాదు. దీంతో  చిత్ర నిర్మాతలు ఆర్మీ సిబ్బంది కోసం గదర్ 2 సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సినిమా ప్రివ్యూ చూసిన వెంటనే ‘గదర్ 2’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కాకుండా, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చాలా ప్రశంసించారు. సన్నీ డియోల్ ఆర్మీ అధికారిగా అద్భుతంగా నటించాడు అంటూ అభినందించారు. 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అని తెలుస్తోంది.  మొదటి సినిమాతోనే గదర్ 2కి లింక్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

గదర్ సినిమాలో భారతదేశం, పాకిస్తాన్ విభజనను.. అప్పటి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కథను సీక్వెల్ గా గదర్ 2 ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమా బ్రిటీష్ ఆర్మీలో పనిచేసిన మాజీ సైనికుడి బూటా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుందని కూడా చెబుతున్నారు. బూటా సింగ్ దేశ విభజన సమయంలో మతపరమైన అల్లర్ల సమయంలో జైనాబ్ అనే ముస్లిం యువతిని రక్షించడమే కాదు.. ఆ అమ్మాయిని ప్రేమించి.. ఆ ప్రేమ విఫలం కావడంతో అప్పట్లో బూటా సింగ్ విషాద ప్రేమకథతో ప్రసిద్ధి చెందాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.