Most Recent

Tamannah: వబసరసల బలడగ ఎదక నటచద చపపసన తమనన

Tamannah: వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా ఎందుకో నటించిందో చెప్పేసిన తమన్నా

స్టార్ హిరోయిన్ తమన్న పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిగ్‌గా మారిపోయింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ మంచి నటిగా గర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీబ్యూటీ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో జైలర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. అలాగే ఇటీవల తమన్నా తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న జీ కర్దా వెబ్ సిరీస్‌లో లిప్‌లాక్‌లు, బెడ్‌రూం సన్నివేశాలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఆమె ఎప్పుడూ కూడా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని చెప్పేసింది. కానీ ఇప్పుడు హద్దు మీరి బోల్డ్ సన్నివేశాలు నటిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల చేస్తు్న్న పరిస్థతి కూడా నెలకొంది.

అయితే ఈ విషయంపై తమన్న ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. తను చేసిన బోల్డ్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయని చెప్పింది. ఆ వెబ్‌సిరీస్ కథకు ఆ సన్నివేశాలు అవసరం అని అనిపించడంతోనే అలా నటించానని స్పష్ట చేసింది. 2023లో కూడా ఇంకా బెడ్‌రూం సీన్ల గురించి విమర్శల చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇప్పటిదాక పెళ్లి చేసుకోలేదని విమర్శించిన వాళ్లు తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పడంతో ప్రస్తుతం దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.