Most Recent

అయయ.. ఐసయల ఉనన పరమఖ పప సగర

అయ్యో.. ఐసీయూలో ఉన్న ప్రముఖ పాప్ సింగర్

ప్రముఖ పాప్ సింగర్, క్వీన్ ఆఫ్ పాప్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మడోన్నా (64) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గత వారం ఆమె తన ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉంది. ఇది గమనించిన వ్యక్తిగత సిబ్బంది ఆమెను ఆస్పత్రి తరలించారు. చికిత్స చేసిన వైద్యలు మడోన్నా తీవ్రమైన బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అయితే మడోన్నా ఆరోగ్యానికి సంబంధించి ఆమె సహయకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధిచిన విషయాన్ని పోస్టు చేశాడు. గత శనివారం మడోన్నా అచేతన స్థితిలో పడి ఉన్నారని.. దీంతో ఆమెను న్యూయార్క్‌లోని ఓ హస్పిటల్‌కు తీసుకొచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని తెలిపాడు. పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నా ఆమె ఆరోగ్యం నెమ్మదిగా కోలుకుంటుందని చెప్పాడు.

అయితే ఆమె పూర్తిగా కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుందని వివరించాడు. మడోన్నా అంటే మంచి పాప్ సింగర్ అని ప్రపంచవ్యా్ప్తంగా తెలిసిన విషయమే. అయితే ఈమె జులై నుంచి కెనడాలో పర్యటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దానికి సంబంధించిన షెడ్యుల్స్ అన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వ్యక్తిగత సహాయకుడు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా మడోన్నాకు ఉన్న అనేక మంది అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. మడోన్నా ఓ గాయనిగానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.