![Surender Reddy: ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డికి ఓకే చెప్పిన మెగా హీరో అతడే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/surender-reddy.jpg)
టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్ రెడ్డి కిక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి, మహేష్ తో అతిథి సినిమాలు చేశారు. ఇక కిక్ సినిమా తర్వాత రేసుగుర్రం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ తో చేసిన ధ్రువ సినిమా మంచి హిట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవితో సైరా వీరసింహారెడ్డి సినిమాలాంటి పిరియాడికల్ డ్రామా కూడా తెరకెక్కించారు. ఇక చివరిగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో కలిసి ఏజెంట్ అనే సినిమా చేశాడు. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఏజెంట్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి సినిమా కాదని.. కామెంట్స్ చేశారు. ఇక ఏజెంట్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నాడని గతంలో టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్లాన్ మారిందని తెలుస్తోంది. ఏజెంట్ రిజల్ట్ తో సురేందర్ రెడ్డి డైలమాలో పడ్డారు.
దాంతో పవన్ తో చేయాల్సిన సినిమా పక్కన పెట్టేసి .. ఇప్పుడు మరో మెగా హీరోతో చేస్తున్నారట.. ఆ హీరో ఎవరోకాదు వైష్ణవ్ తేజ్. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఆది కేశవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతకు కూడా సిద్ధంగా ఉన్నారట. ఈ మూవీ పనులు కూడా చకచకా జరుగుతున్నాయట. త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.