Most Recent

Nithiin: పలస డరస వసకననన యగ హర నతన.. ఏ సనమల అట..

Nithiin: పోలీస్ డ్రస్ వేసుకోనున్న యంగ్ హీరో నితిన్.. ఏ సినిమాలో అంటే..

కుర్ర హీరో నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి.. భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇక ఇప్పుడు నితిన్ తనకు భీష్మ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నితిన్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారట వక్కంతం వంశీ.

ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నితిన్ సినిమాల్లో నటింటే ఆర్టిస్ట్ గా కనిపిస్తాడట. అలా సినిమాల కోసం ఎన్నో రకాల వేషాలు వేసే నితిన్.. ఓ సారి పోలీస్ గెటప్ ప్వేస్తాడట.. దాంతో ఊహించని పరిణామాలు జరుగుతాయని.. దాంతో కథ మలుపు తిరుగుతుందట.

ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మరి దీనిలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. వక్కంతం వంశీ రచయితగా ఎన్నో సినిమాలకు పంచేశారు. ఇక దర్శకుడిగా మారి అల్లు అర్జున్ తో కలిసి నా పేరు సూర్య అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.