Most Recent

VJ Sunny: బిగ్‌బాస్‌ ఫేమ్‌ వీజే సన్నీకి గాయం.. షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ తగిలిన బుల్లెట్‌.. ఆస్పత్రికి తరలింపు

VJ Sunny: బిగ్‌బాస్‌ ఫేమ్‌ వీజే సన్నీకి గాయం.. షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ తగిలిన బుల్లెట్‌.. ఆస్పత్రికి తరలింపు
Bigg Boss Fame Vj Sunny

వీజే సన్నీ.. తెలుగు బిగ్‌బాస్‌ షోసే చూసే వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మొదట న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అతను కొన్ని సీరియల్స్‌, టీవీ షోస్‌లో కనిపించాడు. అయితే బిగ్‌బాస్‌ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన డేరింగ్‌ యాటీట్యూడ్‌ అండ్‌ బిహేవియర్‌తో బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సన్నీ బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతగా నిలిచాడు. ఇదే క్రేజ్‌తో ఇప్పుడు వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాడు. ఇటీవల సన్నీ నటించిన వెబ్‌సిరీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో సన్నీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అతను అన్‌స్టాపబుల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో వీజే సన్నీతో పాటు సప్తగిరి, షకలక శంకర్, పృథ్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా అన్‌స్టాపబుల్ సినిమా ప్రమోషన్‌లో హీరో సన్నీకి ప్రమాదం చేసింది. మూవీ ప్రోమోను డైరెక్టర్ షూట్ చేస్తుండగా సన్నీకి గాయమైంది. పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపిస్తూ పృథ్వీని ‘అన్ స్టాపబుల్’ సినిమా రిలీజ్ ఎప్పుడని అడిగుతాడు. పృథ్వీ ‘నాకేం తెలుసు’ అని సమాధానం చెప్తాడు. అదే సమయంలో సీన్ లోకి ఎంటరైన సన్నీవైపు రివాల్వర్ ఎక్కుపెట్టిన సప్తగిరి అతన్ని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ఈ సమయంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్ పొరపాటున పేలింది. అందులో ఉన్న డమ్మీ బుల్లెట్ సన్నీ వైపు వేగంగా దూసుకెళ్లింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ అతి సమీపం నుంచి తగలడంతో సన్నీ గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by VJ Sunny (@iamvjsunny)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.