Most Recent

వేణుమాధవ్‌, ఉదయభానులతో ఉన్న ఈ పాపులర్‌ కమెడియన్‌ని గుర్తుపట్టారా? అతని యాస, ప్రాసలకు పొట్టచెక్కలవ్వాల్సిందే

వేణుమాధవ్‌, ఉదయభానులతో ఉన్న ఈ పాపులర్‌ కమెడియన్‌ని గుర్తుపట్టారా? అతని యాస, ప్రాసలకు పొట్టచెక్కలవ్వాల్సిందే
Tollywood

వన్స్‌ మోర్‌ ప్లీజ్‌.. 2000 వ దశకంలో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న టీవీ షో. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ ట్యాలెంట్‌ హంట్‌ షోకు యాంకర్లుగా వ్యవహరించారు ఉదయభాను, దివంగత నటుడు వేణుమాధవ్‌. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్‌ సినిమా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడిపోయాడు. ఇక ఉదయభాను కూడా స్టార్‌ యాంకర్‌గా ఫుల్‌ పాపులారిటీ సొంతం చేసుకుంది. కాగా ఎంతో మంది నటీ నటులు, కళాకారులకు తమ ట్యాలెంట్‌ను పరిచయం చేసేందుకు చక్కని వేదికగా ఉపయోగపడింది వన్స్‌ మోర్‌ ప్లీజ్‌. అందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్‌ కూడా ఉన్నాడు. కెరీర్‌ ప్రారంభంలో ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్‌ మోర్‌ ప్లీజ్‌లో అదృష్టం పరీక్షించుకున్నాడు. షోలో భాగంగా యాంకర్లు ఉదయభాను, వేణుమాధవ్‌లతో సరదాగా ఫొటోలు దిగాడు. పై ఫొటో కూడా అందులోదే. మరి ఇందులో వేణు మాధవ్‌, ఉదయభానుల మధ్య ఉన్న ఆ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా? బక్కపల్చటి దేహంతో కనిపిస్తున్న అతను ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్‌ కమెడియన్‌. మొదట జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన యాస, ప్రాస, పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించాడు. ఆ తర్వాత షోకు గుడ్‌ బై చెప్పేసి సినిమాల్లో స్థిరపడిపోయాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా మరి? కనిపెట్టక పోయినా నో ప్రాబ్లం సమాధానం మేమే చెబుదాం లెండి. అతను మరెవరో కాదు.. రచ్చ రవి

‘ఓ రెండు నిమిషాలు ఆగుతావా’ అంటూ ఇటీవల బలగం సినిమాలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన రచ్చ రవిలో మిమిక్రీ ట్యాలెంట్‌ కూడా ఉంది. అందులో భాగంగానే కెరీర్‌ ప్రారంభంలో వన్స్‌ మోర్‌ ప్లీజ్‌ ట్యాలెంట్‌ షోకు హాజరయ్యాడు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత అప్పటి యాంకర్లు ఉదయభాను, వేణు మాధవ్‌లతో సరదాగా ఫొటోలు దిగాడు. గతంలో రచ్చ రవి ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. ‘జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అనే పోగ్రాంలో వేణు మాధవ్ ,ఉదయభాను యాంకర్ గా ఉన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేశా’ అంటూ తన మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Racha Ravi (@meracharavi)

 

View this post on Instagram

 

A post shared by Racha Ravi (@meracharavi)

 

View this post on Instagram

 

A post shared by Racha Ravi (@meracharavi)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.