Most Recent

Tollywood: ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? కేవలం హీరోయిన్ మాత్రమే కాదు మరో టాలెంట్ కూడా

Tollywood: ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? కేవలం హీరోయిన్ మాత్రమే కాదు మరో టాలెంట్ కూడా
Heroine Childhood Photo

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీల హడావిడి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. వారి ఏదైనా పోస్ట్ చేసినా.. ఫోటోలు పెట్టినా.. సినిమా అప్ డేట్స్ పంచుకున్నా ఇట్టే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు వారి చిన్ననాటి ఫోటోలు సైతం ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. ప్రజంట్ మీ ముందుకు ఓ క్రేజీ హీరోయిన్  చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చాం. తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? తను అందాల రాసి.. మతి పోగొట్టే అందం తన సొంతం. మోడ్రన్ అమ్మాయిగా మెప్పిస్తుంది. పల్లెటూరి పిల్ల పాత్రల్లో కూడా అదరగొడుతుంది. ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట చేసే రచ్చ అయితే అంతా ఇంతా కాదు.

ఏంటి ఏమైనా గెస్ చేశారా..? ఇంకా క్లూ ఇవ్వాలంటే.. తను బాక్సర్ కూడా. లుక్ కుదరడంతో హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది. ప్రజంట్ యువ హీరోల సరసన సినిమాల్లో నటిస్తోంది. ఇంత చెప్పినా గుర్తించలేదంటే.. ఇక మేమే చెప్పేస్తాం లేండి. తను రితికా సింగ్. వెంకటేష్ గురూ మూవీలో హీరోయిన్‌గా చేసింది ఈ అమ్మాయి.  ముంబైలో పుట్టి పెరిగిన రితికా.. చిన్నప్పటి నుంచి మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. తండ్రి శిక్షణలో ఆరితేరి సూపర్ ఫైట్ లీగ్ ఫస్ట్ సీజన్​లో పాల్గొంది. ఇక దర్శకురాలు సుధా కొంగర తనసినిమా కోసం నిజమైన బాక్సర్​ను వెతికే క్రమంలో రితిక తారసపడింది. అలా ఈమెతో సాలా ఖాదూస్ ఇరుది సుట్రూ సినిమా తీసింది. తమిళ్, హిందీలో ఆ సినిమా విజయవంతమైంది. దీన్నే తెలుగులో గురు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో బాక్సర్ కాస్త హీరోయిన్ అయిపోయి సినిమాలు చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.