Most Recent

Sharath Babu: రమాప్రభ-శరత్ బాబు విడాకులకు అసలు కారణం అదేనా..?

Sharath Babu: రమాప్రభ-శరత్ బాబు విడాకులకు అసలు కారణం అదేనా..?
Ramaprabha And Sarath Babu

సీనియర్‌ నటుడు, అముదాల వలస అందగాడు అయిన శరత్‌బాబు అనారోగ్యంతో సోమవారం ఓ ప్రైవేట్‌ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలసిందే. చూడగానే ఆకట్టుకునే రూపం, ప్రత్యేకమైన స్వరం, హుందాతనం.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే తన సహజ నటనతో అలరించిన శరత్ బాబు వైవాహిక జీవితం ఎందుకో సజావుగా సాగలేదు. అప్పట్లోనే స్టార్ కమెడియన్‌గా పేరు పొందిన రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శరత్ బాబు స్నేహితుడైన లక్ష్మీకాంత్ ద్వారా రమాప్రభ పరిచయం అయ్యారు. శరత్ బాబు సినీ కెరీర్‌లో ఎదిగేందుకు రమాప్రభ తన పరిచయాల ద్వారా అండగా నిలిచారు. ఐతే వీరి బంధంపై అప్పట్లో పుకార్లు రేగాయి. ఆ పుకార్లనే నిజం చేయాలని శరత్ బాబు-రమాప్రభ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

వివాహం తర్వాత వీరిద్దరూ గాంధీనగర్ రెండవ వీధి, అప్పుల అప్పారావు సినిమాలు నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌ హీరో తీసిన ఈ సినిమాలు రెండు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. రమాప్రభ సమీప బంధువుల అమ్మాయితో రాజేంద్రప్రసాద్‌ వివాహం కూడా జరిపించారు. అప్పట్లో శరత్‌ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో మరచిపోలేని రోజులు మూడు ఉన్నాయని ప్రకటించారు. తన పుట్టిన రోజు, రమాప్రభ పుట్టిన రోజు, తమ పెళ్లి రోజు అని చెప్పిన శరత్‌బాబు పేర్కొన్నారు. తమకు సంతానం కలుగకపోయినా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఇంతగా ప్రేమానురాగాలు ఉన్న ఈ దంపతులు.. పద్నాలుగేళ్ల కాపురం తర్వాత పొరపొచ్చాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే పొరపొచ్చాలు వచ్చాయని పలువురు అనుకుంటున్నారు. తాను కోట్ల ఆస్తులు సంపాదించి రమాప్రభకు ఇచ్చానని శరత్ బాబు, తన ఆస్తులను మోసం చేసి రాయించుకున్నాడని రమాప్రభ.. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఐతే వీరి విడాకుల వెనుక అసలు కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

రమాప్రభతో విడిపోయిన రెండేళ్లకు తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహను వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితం కూడా ఎంతో కాలం నిలవలేకపోయింది. మనస్పర్ధల కారణంగా 2011లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శరత్ బాబు ఒంటరిగానే జీవిస్తూ వచ్చారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.