Most Recent

Dimple Hayathi : ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టడం పై స్పందించిన డింపుల్ హయతి.. ఏమని ట్వీట్ చేసిందంటే..

Dimple Hayathi : ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టడం పై స్పందించిన డింపుల్ హయతి.. ఏమని ట్వీట్ చేసిందంటే..
Dimple Hayathi

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి పై పోలీస్ కేసు నమోదైంది. ఐపీఎస్ కారును ఢీకొట్టడంతో పాటు దుర్భాషలాడినందుకు హీరోయిన్ డింపుల్ పై పోలీస్ కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును డింపుల్ తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత రచ్చ చేస్తూ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నిందని తెలుస్తోంది. దాంతో రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. డింపుల్ హయతితో పాటు ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

ఐపీఎస్ కారును ఢీకొట్టడంతో పాటు దుర్భాషలాడినందుకు ఆమె పై కేసు నమోదు చేయడమే కాదు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఇక ఈ విషయం పై ఐపీఎస్ అధికారి రాహుల్ మాట్లాడుతూ.. దింపు ప్రవర్తన మొదటి నుంచి ఇలానే ఉంటుంది. ఆమె చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

పలుమార్లు నచ్చచెప్పినా ఆమె పద్ధతి మార్చుకోలేదని అన్నారు రాహుల్ హెగ్డే. ఇదిలా ఉంటే ఈ విషయం పై హయతి ట్విట్టర్ వేదికగా స్పందించింది. అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు అంటూ ట్వీట్ చేసింది దింపుల్. దాంతో పాటు ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేసింది డింపుల్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.