

కుటుంబంలోని అనుబంధ బాంధవ్యాలకు పెద్దపీట వేస్తూ జబర్దస్త్ కమెడియన్ తెరకెక్కించిన సినిమా బలగం. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కట్టుబాట్లను చక్కగా చూపించారు ఈ సినిమాలో. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 3న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సూపర్‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆతర్వాత ఓటీటీలోనూ దుమ్ము రేపింది. ఇప్పటికీ తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేసుకుని మరీ బలగం సినిమాను వీక్షిస్తున్నారు. ఇక అంతర్జాతీయంగానూ బలగం సినిమాకు అవార్డులు క్యూ కట్టాయి. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బలగం సినిమాకు అవార్డులు వరించాయి. తాజాగా మరో రెండు అవార్డులు ఈ మూవీ ఖాతాలో చేరాయి. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ మూవీకి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య) అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు యల్దండి ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
కాగా ఇటీవల తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో బలగం సినిమాపై ఓ ప్రశ్న కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో .. ‘మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది? అని ప్రశ్న అడిగారు. ఈ అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఇప్పటికే థియేటర్లు, ఓటీటీల్లో రిలీజైన బలగం గత ఆదివారం ( మే 7)న స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన సంగతి తెలిసిందే.
Congratulations thaatha n sayilooo
#balagam @PriyadarshiPN @DilRajuProdctns pic.twitter.com/m5B6QxRuyi
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 8, 2023
Today 6pm on star maa..
#balagam @StarMaa @DilRajuProdctns pic.twitter.com/3wM5YwacG8
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

