Most Recent

Adah Sharma: ఆదా శర్మకు నెట్టింట వేధింపులు.. హీరోయిన్ ఫోన్ నంబర్ లీక్..

Adah Sharma: ఆదా శర్మకు నెట్టింట వేధింపులు.. హీరోయిన్ ఫోన్ నంబర్ లీక్..
The Kerala Story

నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ది కేరళ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. అనేక వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్స్ సృష్టిస్తుంది. లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాలు బ్యాన్ చేసినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం సత్తా చాటుతుంది. ఈ సినిమాతో ఆదా శర్మ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది. అంతేకాకుండా వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ ఆదా శర్మకు నెట్టింట షాక్ తగిలింది. ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీక్ చేశాడు ఓ వ్యక్తి.

ఆదా శర్మ కాంటాక్ట్ డీటెయిల్స్ ఓవ్యక్తి సోషల్ మీడియాలో లీక్ చేయగా.. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన jhamunda_bolte అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌ను డీయాక్టివేట్ చేయగా.. తనే ఆదా శర్మ కొత్త కాంటాక్ట్ నంబర్‌ను కూడా లీక్ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల హీరోయిన్ ఆదాశర్మ.. డైరెక్టర్ సుదీప్తో సేన్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వీరిద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉంది.. కానీ రోడ్డు ప్రమాదం జరగడంతో ఈ కార్యక్రమానికి హజరు కాలేకపోయారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తన టీమ్ మొత్తం సేఫ్ అని తెలియజేశారు.

Adah Sharma

Adah Sharma

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.