Most Recent

Kriti Sanon: అల్ట్రా గ్లామరస్‌ లుక్స్‌లో అదరగొడుతోన్న ప్రభాస్ హీరోయిన్

Kriti Sanon: అల్ట్రా గ్లామరస్‌ లుక్స్‌లో అదరగొడుతోన్న ప్రభాస్ హీరోయిన్
Kriti Sanon

సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌.. ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఆన్‌ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కృతి పేరు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్‌తో పాటు ఫిలిం ఈవెంట్స్‌లో ఈ బ్యూటీ లుక్స్‌… ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వన్ నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్‌… ఆ సినిమా ఫెయిల్ అవ్వటంతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దూరమయ్యారు. తరువాత తెలుగులో చైతూతో కలిసి దోచెయ్ సినిమా చేసినా.. అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రాలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యారు కృతి.

తెలుగులో ఫెయిల్ అయినా.. నార్త్‌లో కృతి జోరు మామూలుగా లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తోనూ సత్తా చాటుతున్నారు కృతి. అదే సమయంలో గ్లామర్‌ ఇమేజ్‌తోనూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య ఫిలిం ఈవెంట్స్‌లో రెగ్యులర్‌గా కనిపిస్తున్న కృతి.. అల్ట్రా గ్లామరస్‌ లుక్స్‌లో అదరగొడుతున్నారు.

మోడ్రన్‌ డ్రెస్ అయినా.. ట్రెడిషనల్‌ డ్రెస్‌ అయినా… గ్లామర్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా ఉంటున్నాయి ఈ బ్యూటీ లుక్స్‌. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్‌ కూడా క్యూ కడుతున్నాయి. ప్రమోషన్స్‌లో కృతి గ్లామర్‌ సినిమాకు అడ్వాంటేజ్‌ అవుతుందన్న నమ్మకంతో ఉంది నార్త్ ఇండస్ట్రీ.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.