Most Recent

Sarkaru Vaari Paata: అల్లూరి సీతారామరాజుగా మహేశ్‌.. సూపర్‌ స్టార్‌ కృష్ణ సమాధానం ఏంటంటే..

Krishna And Mahesh

Krishna: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య మే12న విడుదలైన ఈసినిమా మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. అలాగే రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి వసూళ్లలో నయా రికార్డు సాధించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన మొదటి రీజినల్‌ సినిమాగా సర్కారు వారి పాట రికార్డుకెక్కింది. కాగా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో సాగుతున్న ఈ సినిమాపై మహేశ్‌ తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ మొదటిసారిగా స్పందించారు. సర్కారు వారి పాట ఇంత ఘనవిజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.

అందుకే  పెద్దగా బయటకు వెళ్లలేదు..

‘మహేశ్‌ నటించినసర్కారు వారి పాట సినిమాను ఇంట్లోనే నా హోం థియేటర్లో చూశాను. సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్‌ చేశాను. సర్కారు వారి పాట సినిమా చాలా బాగుంది. ఫస్ట్‌ హాప్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటే.. సెకండ్‌ హాఫ్‌లో మహేశ్‌ పర్ఫామెన్స్‌ అదిరిపోయింది. ఈ సినిమాలో బాగా నటించావని, పోకిరి, దూకుడు కంటే కూడా సర్కారు వారి పాట పెద్ద హిట్‌ అవుతుందని చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా అన్ని సెంటర్లలోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. ఇక ఈ చిత్రంలో మహేశ్‌ పోకిరి కంటే కూడా చాలా అందంగా, యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఇందుకోసం మహేశ్‌ చాలా కష్టపడతాడు , షూటింగ్‌ లేనప్పుడు ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతాడు. ఈ సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారు. బాగా స్ట్రెయిన్‌ అవుతున్న కారణంగా గత 5 ఏళ్లుగా పెద్దగా బయటకు వెళ్లడం లేదు. అందుకే పుట్టిన రోజు వేడుకలు కూడా సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు’ అని కృష్ణ తెలిపారు. కాగా భవిష్యత్తులో మహేశ్‌ అల్లూరి సీతారామరాజు సినిమా చేసే అవకాశం ఉందా? అని అడగ్గా వందశాతం ఈ మూవీ చేయబోడని కృష్ణ సమాధానమిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

JioPhone Next: జియో ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే..

“ఆ దేశ చర్యలతో కొత్త వేరియంట్లు పుట్టుకురావచ్చు”.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

RRR Movie: 100 థియేటర్లలో మళ్లీ విడుదలవుతోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా.. అందుబాటులోకి అన్‌కట్‌ వెర్షన్‌.. అయితే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.