Most Recent

Deepika Padukone: ఓటీటీలతో సినీ పరిశ్రమకు ముప్పు ఉంటుందా.? ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ..

Deepika

Deepika Padukone: ప్రస్తుతం అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగం పెరగడంతో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయి. దీనికి సినిమా రంగం కూడా మినహాయింపు కాదు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదలవుతాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. మరికొందరైతే దీనివల్ల సినీ పరిశ్రమ దెబ్బ తింటుంది అంటూ పెదవి విరిచారు. అయితే ఇప్పుడు ఓటీటీ రంగం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. కరోనా పుణ్యామాని ఓటీటీ బిజినెస్‌కు ఆదరణ బాగా పెరిగింది. అయితే ఇప్పటికీ ఓటీటీ వల్ల సినిమా పరిశ్రమకు ముప్పు ఉంటుందా.? అన్న ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే ప్రశ్న బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెకు కూడా ఎదురైంది.

ప్రస్తుతం దీపికా ప్రతిష్టాత్మక కేన్స్‌ 75వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఎమినిది మంది జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా హాజరైన దీపికా వేడుకల్లో సందడి చేసింది. అనంతరం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనే దీపికకు ఓటీటీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన దీపిక.. ‘ సాధారంగా రెండు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొంతమంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరు ఇంట్లో సినిమా చూడడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తారు.

ఓటీటీల్లో చూసేవారు కూడా థియేటర్లకు వెళ్తారు. వారివల్ల థియేటర్స్ బతుకుతాయి. అలాగే కొన్ని కథలను ఓటీటీలోనే కొత్త ఫార్మాట్‌లలో చెప్పవచ్చు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం సినిమాలు తీస్తే కథను కొత్తగా చెప్పాలి. ఇలా కథలను కొత్తగా చెప్పడం చాలా మంచిది. దీని వల్ల సినీ ఇండస్ట్రీకి ఎలాంటి నష్టం ఉండదని నా భావన. ఓటీటీల వల్ల నటీనటులకు, నిర్మాతలకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతాయే తప్ప ఇండస్ట్రీకి ఎలాంటి ముప్పు ఉండదు’ అని చెప్పుకొచ్చింది దీపిక.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.