Most Recent

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట టీంకు కంగ్రాట్స్‌ చెప్పిన టాలీవుడ్‌ హీరోలు.. నేడు కర్నూలులో సక్సెస్‌ మీట్‌..

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) నటించిన సర్కారువారి పాటకలెక్షన్లలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. మే12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం మూడు రోజులకు గానూ రూ.112 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు ట్రేడ్‌ పండితులు పేర్కొన్నారు. ఇక ఓవర్సీస్‌లోనూ మహేశ్‌ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఏకంగా రూ.2 మిలియన్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు దర్శక నిర్మాతలు ట్వీట్‌ చేశారు. కాగా మహేశ్‌ బావమరిది సుధీర్‌బాబు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాను వీక్షించాడు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘సర్కారు వారి పాట సినిమాను చూశాను. ఎప్పటిలాగే మహేశ్‌ తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన స్ర్కీన్‌ ప్రజెన్స్‌ సూపర్బ్‌. సినిమా మొత్తం ఎంజాయ్‌ చేశాను. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన సర్కారు వారి పాట టీంకు అభినందనలు’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు సుధీర్‌.

మా మేనల్లుడు కూడా క్లబ్‌లో జాయిన్‌ అయ్యాడు..

కాగా టాలీవుడ్ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ మహేశ్‌ సినిమాకు కంగ్రాట్స్‌ చెప్పాడు. ఈసందర్భంగా తన మేనల్లుడు సర్కారువారి పాట సినిమాను చూస్తోన్న వీడియోను షేర్‌ చేస్తూ ‘ మా ఫ్యామిలీ నుంచి మరొకరు మహేశ్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌లో చేరిపోయాడు’ అని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా సర్కారు వారి పాట చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. ఇక ఓవర్సీస్‌లో 2మిలియన్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది మహేశ్‌ సినిమా. ఈ సందర్భంగా SVP టీంకు అభినందనలు తెలిపాడు యంగ్‌ హీరో అడవి శేశ్‌.

నేడు గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌..

కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది సర్కారు వారి పాట. ఈ సందర్భంగా నేడు (మే16) కర్నూలులో గ్రాండ్‌ సక్సెట్‌ మీట్‌ను నిర్వహించనుంది చిత్రబృందం. కర్నూల్ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

D Imman: రెండో పెళ్లి చేసుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Pallavi Dey: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. సీరియల్‌ నటి అనుమానాస్పద మృతి..

Sarkaru Vaari Paata collections: బాక్సాఫీస్‌పై సర్కారు వారి పాట దండయాత్ర.. మూడు రోజుల టోటల్‌ కలెక్షన్స్ ఎంతంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.