Most Recent

D Imman: రెండో పెళ్లి చేసుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

D Imman Wedding

D Imman: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో అతని రెండో వివాహం జరిగింది. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నటి సంగీత, సీనియర్‌ నటీమణి కుట్టి పద్మిని, సింగర్‌ క్రిష్‌ తదితరులు ఇమ్మాన్‌ (D Imman) పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా పనిచేసే మోనికా రిచర్డ్ ని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. అయితే అనూహ్యంగా 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ 2021, డిసెంబర్ 29న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

కాగా విడాకుల తర్వాత జీవితంలో మరో అడుగు ముందుకు వేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌. దీంతో అతను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు షికార్లు కొట్టాయి. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ రెండోసారి పెళ్లి పీటలెక్కాడు. 2002లో విజయ్‌, ప్రియాంక చోప్రా జంటగా నటించిన ‘తమిజన్‌ చిత్రంతో’ సంగీత దర్శకుడిగా మారాడు ఇమ్మాన్‌ . పలు హిట్‌ సినిమాలకు స్వరాలు సమకూర్చారు. విజయ్‌తో పాటు విక్రమ్, అజిత్‌, ఆర్య, ధనుష్‌, విజయ్ సేతుపతి, జయం రవి తదితర స్టార్‌ హీరోల సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అజిత్‌ హీరోగా నటించిన విశ్వాసం చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నాడు. రజనీకాంత్‌ అన్నాత్తే(తెలుగులో పెద్దన్న), సూర్య ET (ఎవరికీ తలవంచకు) సినిమాలకు కూడా ఇమ్మానే బాణీలు అందించాడు.

 

View this post on Instagram

 

A post shared by Kutty Padmini (@kuttypadmini)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Pallavi Dey: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. సీరియల్‌ నటి అనుమానాస్పద మృతి..

Sarkaru Vaari Paata collections: బాక్సాఫీస్‌పై సర్కారు వారి పాట దండయాత్ర.. మూడు రోజుల టోటల్‌ కలెక్షన్స్ ఎంతంటే..

DJ Tillu: వైజాగ్‌లో సందడి చేసిన డీజే టిల్లు.. భారీగా తరలివచ్చిన అభిమానులు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.