Most Recent

Sangeetha Sajith: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగర్ సంగీత సాజిత్ మృతి..

Sangeetha

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సంగీత సజిత్ (46) (Sangeetha Sajith) ఆదివారం ఉదయం తిరువనంతపురంలో కన్నుమూశారు.. సంగీత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తన సోదరి నివాసంలో ఉంటుంది.. ఆదివారం ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో సంగీత తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.. సంగీత అకాల మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు..

సంగీత మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో 200కి పైగా పాటలు పాడారు.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తమిళ చిత్రం మిస్టర్ రోమియో సినిమాలో ఆమె పాడిన తన్నెరై కథలిక్కుమా.. పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే పృథ్వీరాజ్ నటించిన కురుతి చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్ ఆమె చివరి పాట.. 1992 తమిళ చిత్రం నాళయ్య తీర్పులో తొలిసారిగా పాట పాడింది సంగీత. 1998లో ఎన్ను స్వంతం జానకికుట్టిలోని ‘అంబిలి పూవట్టం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020లో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో తలం పోయి సాంగ్ పాడారు.. సంగీత అకాల మరణం పట్ల ముఖ్య్మంత్రి పినరయి విజయన్, నేపథ్య గాయని కెఎస్ చిత్రం, ఇతర గాయనిగాయకులు సంతాపం తెలియజేశారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.