Most Recent

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద.. ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్..

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలుమార్లు చరణ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో షూటింగ్ లొకేషన్ నుంచి చరణ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో చరణ్ నడిరొడ్డుపై ట్రాఫిక్ పోలీస్ ముందే నానా హంగామా చేస్తున్నాడు.. పక్కనే ఉన్న బోర్డ్స్ లాగి పడేసి వీరంగం చేస్తున్నాడు. తాజాగా విడుదలైన వీడియోలో చరణ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.. రెడ్ టీ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని స్టైలీష్ గా కనిపిస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర టాకీపార్ట్, సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్… మరో రెండు విభిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.