Most Recent

Faria Abdullah: కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తున్న జాతిరత్నాలు బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‏గా ఫరియా ?..

Faria Abdullah

డైరెక్టర్ అనుదీప్ కేవీ.. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జాతి రత్నాలు. ఈసినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). మొదటి సినిమాతోనే నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో చిట్టి పాత్రలో కనిపించి ప్రశంసలు పొందింది ఫరియా. ఈ సినిమా తర్వాత ఫరియాకు చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ అవేమి అధికారికంగా పట్టాలెక్కలేదు.. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఫరియా.. ఇటీవల వచ్చిన బంగార్రాజు మూవీలో స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులేసింది. ప్రస్తుతం మాస్ మాహరాజా రవితేజ సరసన రావణసుర సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందట.

బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ్ హీరో విజయ్ ఆంటోని. కేవలం కోలీవుడ్‏లోనే కాకుండా.. తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ సుసీంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‏గా ఫరియాను ఎంపిక చేశారట మేకర్స్. ఇందులో ఫరియా పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. తెలుగు వరుస ఆఫర్లు అందుకుంటూ తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.