Most Recent

NTR and Koratala Siva: ఆచార్య ఎఫెక్ట్.. తారక్ షాకింగ్ నిర్ణయంతో కొరటాల శివ సినిమా ఆలస్యం

Ntr

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగిన కొరటాల(Koratala Siva)కు ఊహించని షాక్ తగిలింది. ఆచార్య(Acharya) సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కొరటాల నుంచి ఇటువంటి సినిమా అస్సలు ఊహించలేదని నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ కూడా చేశారు. అయితే ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాను అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పుడు తారక్ కొరటాల సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఆచార్య ఎఫెక్ట్ తో తారక్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆచార్య రిజల్ట్ నుంచి తేరుకోవడానికి కొరటాలకు కొంత సమయం ఇచ్చాడట టైగర్.

తారక్ కోసం కొరటాల ఆచార్య కంటే ముందే ఓ కథను లాక్ చేసి పెట్టారు. అయితే ఆచార్య రిజల్ట్ నేపథ్యంలో మరోసారి కథ పై పూర్తి దృష్టి పెట్టమని చెప్పారట తారక్. స్క్రిప్ట్ మీద మరోసారి వర్క్ చేయమని కొరటాలకు సూచించారట ఎన్టీఆర్. జూన్ నుంచి షూటింగ్ ను కూడా షురూ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆలస్యం అయినా పర్లేదు కానీ రీస్క్ తీసుకోవద్దని.. స్టోరీ లైన్ మరియు స్క్రిప్ట్ పై మరోసారి కూర్చోమని కొరటాలకు ఎన్టీఆర్ చెప్పారట. ఈ మూవీని కల్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించాలని భావించారు. కానీ ఇప్పుడు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Nora Fatehi : పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

Keerthy Suresh: మహానటి ఆశలన్నీ మహేష్ సినిమా పైనే.. ఈ సారి కీర్తి గట్టెక్కేనా..?

Chiranjeevi: అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న మెగాస్టార్

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.