Most Recent

Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి.. వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు వెళ్తున్నారు. చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేస్తూ అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి, ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో విదేశీ రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా చాలా ఏళ్ల తర్వాత సతీసమేతంగా విదేశీ యాత్రకు బయల్దేరారు. అర్ధాంగి సురేఖతో కలిసి అమెరికా, యూరప్ దేశాలకు పర్యటనకు వెళుతున్నట్టు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కరోనా వ్యాప్తి తర్వాత తాను విదేశీ యాత్రకు వెళ్లడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కొన్నిరోజుల విహారయాత్ర అనంతరం తిరిగొస్తానని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన మోహన్‌రాజాతో గాడ్ ఫాదర్, బాబీతో ఓ చిత్రం, మెహర్ రమేశ్ తో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు రాధిక సొంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లోనూ ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు మెగాస్టార్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: పెరగనున్న ‘రుణ’ భారం.. ఈఎంఐ ల మోతకు సిద్ధంగా ఉండండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.