Most Recent

Major Movie: ఆ విషయంలో ఎఫ్‌3ని ఫాలో అవుతోన్న మేజర్‌.. కీలక ప్రకటన చేసిన అడివి శేష్‌..

Major Movie

Major Movie: కరోనా పరిస్థితుల కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. దాదాపు రెండేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సినీ పరిశ్రమను ఆదుకునే క్రమంలో భారీ బడ్జెట్‌ చిత్రాలకు టికెట్‌ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుకునే అవకాశం కల్పించాయి. దీంతో పలు సినిమాలు పెంచిన ధరలతోనే ప్రేక్షకుల ముందకు వెళ్లాయి. అయితే ఈ పెంపు వల్ల కొందరు ప్రేక్షకులకు సినిమా భారంగా మారిందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రిపీట్‌ ఆడియన్స్‌ సినిమాకు రావట్లేదన్న వార్తలు బాగా వినిపించాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఎఫ్‌3 సినిమాకు టికెట్ల ధరలను పెంచడం లేదని, పాత ధరలకే సినిమా ఎంజాయ్‌ చేయండని నిర్మాత దిల్‌రాజ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మేజర్‌ మూవీ కూడా వచ్చి చేరింది. తమ సినిమాకు టికెట్ల ధరలను పెంచడం లేదని తాజాగా హీరో అడివి శేషు అధికారికంగా తెలిపాడు. ‘ఆస్క్‌ శెష్‌’ పేరుతో నిర్వహించిన సెషన్‌లో ఓ అభిమాని.. సినిమా టికెట్ల ధరను తగ్గిస్తే, రిపీటెడ్‌ ఆడియన్స్‌ పెరుగుతారు, ఫలితంగా ఇండస్ట్రీని కూడా కాపాడుకోవచ్చు అని సూచించారు.

దీంతో దీనికి వెంటనే బదులిచ్చిన శేష్‌.. మేజర్‌ సినిమాకు సాధారణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని. టికెట్ల ధరలను పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మేజర్‌ చిత్రాన్ని 2008లో ముంబై దాడుల్లో వీర మరణం పొందిన ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.