Most Recent

Akshay Kumar: నార్త్‌, సౌత్‌ అనే విభజన నచ్చదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అక్షయ్‌ కుమార్‌..

Akshay Kumar

Akshay Kumar: ఇటీవల నార్త్‌ సినిమా వర్సెస్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అంశం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌, బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ల మధ్య మొదలైన వ్యవహారం కాస్త తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో అటు నార్త్‌ తారలు, ఇటు సౌత్‌ తారలు పోటాపోటీగా కామెంట్స్‌ చేశారు. అయితే తాజాగా ఇదే విషయమై బాలీవుడ్‌ అక్షయ్‌ కుమార్ స్పందించారు.

అక్షయ్ తాజా చిత్రం పృథ్వీరాజ్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో అతనికి నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ ఇండస్ట్రీపై జరుగుతోన్న చర్చకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు అక్షయ్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నార్త్‌, సౌత్‌ అనే విభజన నాకు నచ్చదు. అసలు నేను పాన్‌ ఇండియా అనే పదాన్ని నమ్మను. మనమంతా ఒకే ఇండస్ట్రీకి చెందినవాళ్లం. ఇకపై ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఇక బ్రిటిషర్లు మనల్ని విభజించి.. పరిపాలించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. వీటి నుంచి పాఠాలను నేర్చుకోవాలి. మనమంతా ఒక్కటేనని అనుకున్నప్పుడే ఆరోజు మరింత అద్భుతంగా పని చేయగలం’ అని చెప్పుకొచ్చారు అక్షయ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.