Most Recent

F3 Movie : పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. ‘ఎఫ్3’ నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్

F3

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్నమూవీ  ‘ఎఫ్3’. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలతో పక్కా బ్లాక్ బస్టర్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3′ మూవీ ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమౌతుంది. ఎఫ్3లో మరింత గ్లామర్ జోడించింది ”పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌’ గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా’ సాంగ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ తో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో స్వరపరిచిన ఈ పార్టీ సాంగ్ లో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ గ్రేస్ తో అదిరిపోయే మూమెంట్స్ చేశారు. నాగినీ మ్యూజిక్ కి పూజా, వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ మాస్ ని అలరించేలా వుంది. సాంగ్ లో సునీల్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించి సాహిత్యం క్యాచిగా వుంది. మనిషి పెద్ద కలలు కనాలి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం ఈ పాటలో వుంది. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఫుల్ ఎనర్జీ తో ఈ పాటని ఆలపించారు.  ‘ఎఫ్3′ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎఫ్ 3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు విడుదలైన ”’లైఫ్ అంటే ఇట్లా వుండాలా”’ సాంగ్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తూ .. ఇన్స్టంట్ హిట్ అయ్యింది. ఇక ఎఫ్ 3లో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా సందడి చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shekar Pre Release Event: శేఖర్‌ ప్రీ రీలీజ్ ఈవెంట్.. రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ పడేనా! వీడియో..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.