Most Recent

Alia Bhatt: సూపర్ ఉమెన్‌గా మారిన అందాల అలియా భట్.. కారణం ఇదే

Alia Bhatt.

అందాల భామ అలియా భట్(Alia Bhatt) ఆర్ఆర్ఆర్ (RRR )సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రకోసం ఈ అమ్మడిని జక్కన్న ఎంచుకున్నారు. చరణ్ సరసన నటించిన ఈ చిన్నది.. ఆ తర్వాత తారక్ తో ఓ సినిమా చేయబోతుందంటూ టాక్ గట్టిగా వినిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమాలో అందాల అలియాను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆతర్వాత ఏమైందో ఏమో కానీ తారక్ సినిమాలో అలియా హీరోయిన్ కాదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు రీసెంట్ గా పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో అలియా వివాహం జరిగింది. ఈ పెళ్ళితోపాటు బాలీవుడ్ లో కమిట్ అయినా సినిమాల కారణంగా డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అలియా తారక్ సినిమాకు నో చెప్పిందని టాక్.

ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు గంగూభాయ్ సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. గంగూబాయి సినిమాలో అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ భర్త రణబీర్ తో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలతోనే కాదు యాడ్స్ తోనూ ఈ చిన్నది బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ యాడ్ కోసం అలియా సూపర్ ఉమెన్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shekar Pre Release Event: శేఖర్‌ ప్రీ రీలీజ్ ఈవెంట్.. రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ పడేనా! వీడియో..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.