Most Recent

Viral Photo: బుంగమూతి పెట్టుకున్న ఈ బంతిపువ్వు ఎవరో తెలుసా..? కనిపెట్టడం అంత కష్టం కాదేమో..

Actress

Viral Photo: ప్రస్తుతం సెలబ్రిటీల చైల్డ్‌ హుడ్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా సినీతారలు, క్రికెట్‌ స్టార్ల చిన్ననాటి ఫొటోలు క్షణాల్లోనే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇదే కోవలో ఓ స్టార్‌ హీరోయిన్‌ చిన్ననాటి ఫొటో బాగా ట్రెండ్ అవుతోంది. ఈమె ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకుంది. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ వంటి బడా హీరోలతో పాటు యంగ్ స్టా్ర్స్‌తోనూ ఆడిపాడింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించి ప్రొడ్యూసర్‌గానూ సత్తాచాటింది. టీమిండియాలో రారాజుగా వెలుగొందుతోన్న ఓ స్టార్‌ క్రికెటర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమ్మగా ప్రమోషన్‌ పొంది ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిల్వర్‌ స్ర్కీన్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న ఈమె మళ్లీ వెండితెరపై బిజీగా మారుతోంది. ఓ మహిళా క్రికెటర్‌ బయోపిక్‌తో మళ్లీ మన ముందుకొస్తుంది. ఇలా హీరోయిన్‌గా, అమ్మగా మహిళలకు స్ఫూర్తి నిస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో కాదు.. బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ (Anushka Sharma).

నేటి(మే1)తో 33వ వసంతంలోకి అడుగుపెట్టనుంది అనుష్క. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆతర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌తో ఛాన్స్‌ దక్కించుకుంది. రబ్‌ నే బనాది జోడి సినిమాకు గాను మొదటి చిత్రానికే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకుంది. జబ్‌తక్‌ హై జాన్‌, సుల్తాన్‌, పీకే, దిల్‌ దడ్కనే దో, యే దిల్‌ ముష్కిల్‌, ఎన్‌హెచ్‌ 10, ఫిల్లౌరి, సంజు సినిమాలతో హిందీ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో కొన్ని సినిమాలకు అనుష్క నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. బుల్‌బుల్‌, పాతాల్‌లోక్ వంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించి ప్రశంసలు పొందింది. ఇక 2017లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా గతేడాది జనవరిలో వామికా పుట్టింది. ప్రస్తుతం కూతురి ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది. అదేవిధంగా జులన్‌ గోస్వామి బయోపిక్‌లో మెయిన్‌రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్న అనుష్కా శర్మకు నటిగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ మనమూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం..

హ్యాపీ బర్త్‌డే అనుష్కా..

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

KGF Chapter2: సలాం రాకీ భాయ్‌ అంటోన్న యశ్‌ గారాల పట్టి.. నెట్టింట్లో వైరలవుతోన్న క్యూట్‌ వీడియో..

TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సేవలపై 20 శాతం రాయితీ..

IPL 2022: 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు.. ఒక్కసారిగా విలన్‌గా మారిన 8 కోట్ల ప్లేయర్‌ ఎవరో తెలుసా?

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.