Most Recent

krithi shetty: కృతిశెట్టి డ్రీమ్ రోల్ ఇదేనట.. ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చిన కుందనపుబొమ్మ

Krithi Shetty

టాలీవుడ్ లో అందాల భామలకు కొదవే లేదు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకున్న భామల్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(krithi shetty) ఒకరు. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఈ అమ్మడి లుక్స్ , అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఏ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అంది ఈ అందాల చందమామ. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న కృతి. ప్రస్తుతం రామ్ సరసన వారియర్ సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్ హీరోగా చేస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటిస్తోంది. ఇక సుదీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో నటిస్తుంది కృతి. అలాగే తమిళ్ లోనూ ఈ అమ్మడికి ఛాన్స్ లు దక్కించుకుందని తెలుస్తుంది.

తాజాగా ఓ ఇంట్రవ్యూలో కృతిశెట్టి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కృతిశెట్టి తన ఉపకమింగ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అలాగే తన డ్రీమ్ రోల్ గురించి కూడా ఈ అమ్మడు మాట్లాడింది. ఇంతవరకూ నేను చేసిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివే. అలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం వల్లనే ఆడియన్స్ నన్ను ఆదరించారు.  ‘రాకుమారి’పాత్రలోగా కనిపించాలనేది నా డ్రీమ్ రోల్. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను త్వరలోనే ఆ అవకాశా వస్తుందని ఆశిస్తున్నా” చెప్పుకొచ్చింది కృతిశెట్టి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.