Most Recent

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Actress

పైన ఫోటోలో తన అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూ్ల్ గడిపేస్తుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. దక్షిణాదిలోనే కాకుండా..ఉత్తరాదిలోనూ భారీ ఫాలోయింగ్ సంపాందించుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నారి మరేవరో కాదండోయ్.. టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత. ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సామ్.. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత.. బృందావనం, దూకుడు, ఈగ, ఏటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది అఆ, మహానటి, ఓబేబీ, జాను వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఏమాయ చేశావే సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రానికి నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం సమంత.. యశోధ సినిమాలో నటిస్తుంది. అలాగే ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.