Most Recent

Kaathu Vaakula Rendu Kadhal Twitter Review: కాతువాకుల రెండు కాదల్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. సమంత హిట్ కొట్టేనా ?

Kaathuvaakula Rendu Kaadhal

తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)…లేడీ సూపర్ స్టార్ నయనతార.. హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం కాతువాకుల రెండు కాదల్ (Kaathuvaakula Rendu Kaadhal). ఈ చిత్రానికి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ట్రయాంగిల్‌ ప్రేమ కథలో ఎదురయ్యే సమస్యలను ప్రధానాంశంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విఘ్నేష్‌. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విడుదల కానుంది. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు ఉదయం నుంచే ఈ మూవీ స్పెషల్ షోస్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ రివ్యూ ఇచ్చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి రాంబోగా.. నయనతార కన్మణిగా.. సమంత కజీజగా నటిస్తున్నారు. రౌడీ పిక్చర్స్, స్కీన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాతు వాకుల రెండు కాదల్ సినిమా..ఎపిక్ కాన్సెప్ట్ అని.. బ్రేక్ సన్నివేశం అద్భుతంగా ఉందని.. స్క్రీన్ ప్లే బాగుందంటూ తెలిపారు. కామెడీ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని.. ముఖ్యంగా సమంత, నయనతార మధ్య సాగే సీన్స్ అల్టీమేట్ అని.. ఇద్దరి స్క్రీన్ స్పేస్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత విఘ్నేష్ శివన్ డబుల్ ట్రీట్ ఇచ్చాడని.. విజయ్, సమంత, నయనతార మరోసారి ప్రేక్షకుల మనసులు దొచుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.