Most Recent

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్‌లో రచ్చ.. నిత్యా మీనన్ తమన్ మధ్య గొడవ.?

Nitya, Thaman

ప్రేక్షకులను అలరించడానికి అచ్చతెలుగు ఓటీటీ సంస్థ ఆహా(Aha)సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను తీసుకొస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను, ఆసక్తి కలిగించే వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు అందిస్తుంది ఆహా. అలాగే ఆకట్టుకునే గేమ్ షోస్తో పాటు ప్రేక్షకులను ఉర్రుతలూగించే అతిపెద్ద సంగీత వేదికైన తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol)ను కూడా మన ముందుకు తీసుకువచ్చింది ఆహా. ఇప్పటికే విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తడం.. లేదా జడ్జ్ ల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం జరుగుతూనే ఉంటాయి. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ లో కూడా అదే పరిస్థితి వచ్చింది. డబుల్ ధమాకా స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ సమయం లో కంటెస్టెంట్ మారుతి, సింగర్ శ్రావణ భార్గవి ‘ఏవొండై నానిగారు’ అనే పాట పాడి అందరిని ఉర్రూతలూగించారు.

నిత్య మీనన్, కార్తీక్ చాల గొప్పగా పొగిడారు. అయితే, తమన్ కు మాత్రం నచ్చలేదు. ఆ విషయం మీద నిత్యా మీనన్ తమన్ గొడవపడ్డారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, అప్పటి వరకు మారుతి ని ప్రశంచిన కార్తీక్, నిత్యా కు సహాయానికి రాకపోవడంతో ఆవిడ కార్తీక మీద కూడా విరుచుకుపడ్డారని సమాచారం. ఇదంతా చూస్తుంటే జడ్జ్ ల మధ్య విభేదాల గురించి వస్తున్న కథనాలు నిజమేననిపిస్తోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి. మారుతి ఎలిమినేట్ అవుతాడా.? జడ్జ్  తమ గొడవను పరిష్కరించుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.