Most Recent

Koratala Siva: మెగాస్టార్ మూవీ తర్వాత కొరటాల చూపు ఆ స్టార్ హీరోల వైపు..

Koratala

ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల( Koratala Siva) మంచి హిట్ అందుకున్నారని అంటున్నరు సినిమా చూసిన ప్రేక్షకులు. ఇప్పటికే ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొరటాల రిలాక్స్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కలిపి చూపించే బరువైన బాధ్యతను ఎత్తుకున్న కొరటాల సక్సస్ అయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పుడు కొరటాల నెక్స్ట్ సినిమా గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చిన కొరటాల. చిన్న గ్యాప్ తీసుకొని తారక్ స్టోరీని డవలప్ చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ లాంటి సాఫ్ట్ స్టోరీగా కాకుండా మాస్ మసాలా కథను సిద్ధం చేస్తున్నాడట. అలాగే ఈ సినిమా తారక్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండనుందని టాక్. ఇదిలా ఉంటే తారక్ తర్వాత కొరటాల చూపు ఎవరి వైపు అనే ప్రశ్న తలెత్తుతోంది.

తారక్ తో సినిమా తర్వాత కొరటాల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం పనిచేయాలని చూస్తున్నారట. నిజానికి గతంలో అల్లు అర్జున్ తో కొరటాల సినిమా ఉండాలి.. కానీ అనుకోని కారణాల వల్ల కుదరలేదు. ప్రస్తుతం పుష్ప 2 కోసం రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నాడు బన్నీ. పుష్ప2 ఫినిష్ చేసే లోగా అటు తారక్ సినిమా కూడా అయిపోతుంది. ఆ తర్వాత కొరటాల శివ బన్నీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారు కొరటాల. సమాజానికి మెసేజ్ ఇచ్చే మంచి కథతో పవన్ తో సినిమా చేయాలని చుస్తున్నారట కొరటాల. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం అదిరిపోయే పాయింట్ ను వెతుకుతున్నారట కొరటాల. ఫ్యూచర్ లో కొరటాల బన్నీ, పవన్ తో సినిమాలు చేసే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.