Most Recent

Suniel Shetty: ‘పుష్ప 2’లో స్పెషల్ అట్రాక్షన్.. సునీల్ శెట్టిని రంగంలోకి దింపనున్న సుకుమార్..

Suniel Shetty

తెలుగు సినిమా స్థాయి పెంచిన సినిమాల్లో ఐకాన్ స్టార్ పుష్ప సినిమా ఒకటి.  అల్లు అర్జున్(Allu Arjun) నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. బన్నీ మునుపెన్నడూ కనిపించని ఉరమాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. పుష్ప రాజ్ గా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు ఐకాన్ స్టార్. ఆ పాత్రలో బన్నీ కాకుండా మరో హీరోని ఉహించుకోలేని విధంగా తన నటనతో కట్టిపడేశారు అల్లు అర్జున్. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. మొదటి పార్ట్ కు ఊహించినదానికంటే భారీ విజయం దక్కడంతో ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప1తో సాలిడ్ సక్సెస్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు పుష్ప 2ను ఎలా తెరకెక్కిస్తారా..? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇక పుష్ప 2లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని తెలుస్తున్నాయి. పుష్ప సినిమా మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దాంతో సుకుమార్ ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది. పుష్ప 2 కోసం బాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపాలని చుస్తున్నారట. మొదటి పార్ట్ లో పవర్ ఫుల్ పోలీస్ గా ఫహద్ ఫాజిల్ ను చూపించిన సుకుమార్.. పుష్ప 2 లో మరో స్టార్ హీరోను పవర్ ఫుల్ పోలీస్ గా చూపించనున్నారట. . బాలీవుడ్లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసిన సునీల్ శెట్టి, ఈ మధ్య కాలంలో తెలుగులోనూ నటిస్తున్నారు. మంచు విష్ణు నటించిన మోసగాళ్లు, రీసెంట్ గా వచ్చిన గని సినిమాలో నటించారు సునీల్ శెట్టి. ఇప్పుడు పుష్ప 2లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలోని బలమైన పాత్రల్లో ఇదొకటని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raveena Tandon: స్ట‌న్నింగ్ పోజుల‌తో ర‌చ్చ చేస్తున్న రవీనా టాండన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.