Most Recent

Jayamma Panchayathi : హృదయాన్నికదిలిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’పాట…గొలుసుకట్టు ఘోషలుకు విశేష స్పందన

Suma

స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత సుమ వెండితెర పై కనిపించనున్నారు. సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో జయమ్మగా సుమ తన నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘జయమ్మ పంచాయితీ’ మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా ఈసెంట్ గా ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.

మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు. వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా వుందీ పాట. చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు. కథలో కీలకమైన సందర్భంలో ఈ పాట ఉండబోతుందని సాహిత్యం వింటే అర్ధమౌతుంది. జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాన్ని, ఆ పాత్రలోని ఎమోషనల్ కోణాన్ని ఈ పాట ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ పాటకు విశేష స్పందన లభిస్తుంది. అన్ని వర్గాలనుంచి ప్రేక్షకులు ఈ పాట పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raveena Tandon: స్ట‌న్నింగ్ పోజుల‌తో ర‌చ్చ చేస్తున్న రవీనా టాండన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.