Most Recent

Sreeleela : మహేష్ సినిమాలో శ్రీలీల క్యరెక్టర్‌ను ఇలా డిజన్ చేస్తున్నారట గురూజీ..

Mahesh Babu

పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల(Sreeleela ). రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల అందానికి చలాకీ తనానికి తెలుగు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. దాంతో ఈ అమ్మడికి ఛాన్స్ లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ చిన్నది. మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత కుర్ర హీరోల సరసన నటిస్తుంది శ్రీలీల. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో శ్రీలీలకు ఛాన్స్ దక్కిందని టాక్. మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది.

మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమాతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే పూజ చెల్లెలి క్యారెక్టర్ లో శ్రీలీల నటించనున్నదని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఈ అమ్మడిది చిన్న క్యారెక్టర్ కాదట.. ముందుగా గ్లామర్ కోసం రెండో హీరోయిన్ రోల్ ని క్రియేట్ చేసారట. కానీ ఇప్పుడు కథలో మార్పులు చేస్తున్నారట గురూజీ..  శ్రీలీలకు ఓ సాంగ్ ఇవ్వడంతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలను జోడిస్తున్నారట. దాంతో ఈ చిన్నదని పాత్ర మహేష్ సినిమాలో కీలకం కానుందని తెలుస్తుంది. మహేష్ బాబుతో కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ అలాగే ఒక లవ్ డ్యూయెట్ లో ఆడిపాడనుందట శ్రీలీల.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raveena Tandon: స్ట‌న్నింగ్ పోజుల‌తో ర‌చ్చ చేస్తున్న రవీనా టాండన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.