Most Recent

Allu Sneha Reddy: బన్నీకి ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? స్టైలిష్‌ స్టార్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన స్నేహా రెడ్డి..

Allu Arjun

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ రొమాంటిక్‌ కపుల్‌ అంటే ఠక్కును గుర్తుకు వచ్చే పేరు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun)- స్నేహారెడ్డి దంపతులే. 2011లో పెళ్లిపీటలెక్కిన ఈ క్యూట్‌ కపుల్‌ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ అభిమానులకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతున్నారు. ఇక అల్లు అర్జున్‌ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది స్నేహారెడ్డి (Allu Sneha Reddy ). ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఉండే ఈ అందాల తార తన భర్త, కూతురు, కుమారుడి ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. వాటికి అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఇలా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే స్నేహారెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్లను మించి ఫాలోవర్లు ఉండడం విశేషం. కాగా తీరిక దొరికినప్పుడల్లా ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించే ఈ ముద్దుగుమ్మ తాజాగా నెటిజన్లతో ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ సెషన్‌ నిర్వహించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

ఈ సందర్భంగా బన్నీకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటని ఓ నెటిజన్‌ అడగ్గా.. ‘బిర్యానీ’ అని సమాధానమిచ్చింది. అదేవిధంగా తనకు రెడ్‌ కలర్‌ అంటే చాలా ఇష్టమని, సమయం దొరికినప్పుడల్లా లండన్‌ వెకేషన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతానని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్‌స్టార్‌. త్వరలోనే దీనికి సీక్వెల్‌గా పుష్ప2..ది రూల్‌ ను తెరకెక్కనుంది. రష్మిక మంధాన హీరోయిన్‌గా నటించనుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:

Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది.. ఈ సమస్యలు రావొచ్చు..!

CSK vs PBKS IPL 2022 Match Result: ఫలించని ధోనీ మ్యాజిక్.. ఇద్దరు ధావన్‌ల ధాటికి ఓటమిపాలైన చెన్నై..

Osama Bin Laden: బాబోయ్ ‘బిన్ లాడెన్’ ఇంత పెద్ద స్కెచ్ వేశాడా?.. వెల్లడైన షాకింగ్ రహస్యాలు!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.