
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan Meka )హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.. నిర్మల కామెంట్ అనే సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అనుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా పెళ్లి సందడి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. రోషన్ కు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ తో పాటుగా డ్యాన్సులతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రోషన్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. రోషన్ హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.9 గా ఈ ప్రాజెక్ట్ ను తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన నందిని రెడ్డి వరుస సినిమా లతో దూసుకుపోతుంది. ‘ఓ బేబీ’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. దీని తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్ శోభన్ – మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ‘జాతిరత్నాలు’ మూవీని నిర్మించిన స్వప్న సినిమాస్ సంస్థ ఈ సినిమాని రూపొందిస్తోంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే విడుదల కానుంది. మరి నందిని రెడ్డి రోషన్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :