
క్రికెట్ లో టాస్.. విక్టరీని ఎలా డిసైడ్ చేస్తుందో.. సినిమాల్లో రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ అదే పని చేస్తుంది. మనం తీసుకునే.. నిర్ణయమే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. మనకు విన్ ఫీల్‌ను ఓ రేంజ్లో కలిగిస్తుంది. అయితే బీస్ట్ విషయంలో ఈ డెసీషనే దారి తప్పిందని అంటున్నారు.. సమ్ కోలీవుడ్ క్రిటిక్స్. ఎంత క్రేజీ హీరో అయినా.. ఫ్యాన్స్ బేస్‌లో టాప్ అయినా కూడా… సినిమా బాలేదన్న టాక్‌ను.. ప్రతీ సినిమాకు ఏదో యాంగిల్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ కారణమే ఈ మాటలు.. కొన్ని రోజులైతే సినిమా హిట్టనే టాక్ వస్తుందని కూడా రియలైజ్ అవుతుంటారు. ఇదే థియరీని కామన్‌ఫై చేసి మరీ మాట్లాడుతుంటారు. తమిళ్ స్టార్ హీరో దళపతి కూడా ఇంతే! తన ప్రతీ సినిమాకు మూతి విరుపు రివ్యూలు.. ఫస్ట్ టూ డేస్ నెగెటివ్ మాటలు ఏదో మూల వింటూనే.. లైట్ తీసుకుంటాడు విజయ్. రెండు రోజులైతే జనాల్లోకి మెల్లిగా సినిమా ఎక్కుతుందిలే అని అనుకుంటాడు కూడా..
అయితే ఇదే విషయాన్ని తాజాగా కోట్ చేసిన కోలీవుడ్ క్రిటిక్స్.. బీస్ట్ సినిమా రిలీజ్ ను ఓ వారం వాయిదా వేసినా… ఓ వారం ముందుకు జరిపినా రిజెల్ట్ మరోలా ఉండేది కాదా అని అంటున్నారు. తెలిసి తెలిసి పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 ముందు రిలీజ్ చేయడమే ఈ సినిమా కు మైనస్ అంటున్నారు. కొంచెం గ్యాప్ ఉంటే.. టాక్ మారేది కదాని.. టాస్ థియరీతో సోషల్ మీడియాలో ఎక్స్‌ప్లేన్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. బీస్ట్ సినిమా బాగున్నప్పటికీ .. కేజీఎఫ్ ప్రభావం కనిపించింది ఈ సినిమా పైన.. కొంచం గ్యాప్ తీసుకొని ఉంటే నిజంగానే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకునేదంటున్నారు సినీ విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :