Most Recent

Prabhas: రాఖీభాయ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన యంగ్‌ రెబల్‌ స్టార్‌.. యష్‌ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా?

Prabhas And Yash

KGF Chapter 2: ప్రస్తుతం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్‌2 (KGF Chapter 2) సందడే కనిపిస్తుంది. కన్నడ రాక్ స్టార్ యష్ (yash) నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్‌, యష్‌ హీరోయిజానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అందుకే విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ పాన్‌ ఇండియా చిత్రం. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈక్రమంలో సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమా సెలబ్రిటీలందరూ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా కేజీఎఫ్‌ 2 చిత్రబృందానికి అభినందనలు తెలిపిందే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కూడా ఈ జాబితాలో చేరాడు. ‘బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కేజీఎఫ్ 2 చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీనికి యష్‌ కూడా స్పందించాడు. ‘థ్యాంక్యూ’ అంటూ ఒక స్మైల్‌ ఎమోజీతో రెబల్‌స్టార్‌కు రిప్లై ఇచ్చాడు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ తారలు సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రభాస్‌ విషయానికొస్తే.. రాధేశ్యామ్‌తో మిశ్రమ ఫలితం అందుకున్న అతను కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలోనే సలార్‌ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే, స్పిరిట్‌ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవల మారుతి డైరెక్షన్‌లో నటించేందుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

Also Read:AP Summer Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..

Digital News Round Up: పవన్‌ టూర్‌ లో జగన్‌ భజన || టీ తాగడం కోసం ట్రైన్ ఆపిన డ్రైవర్..లైవ్ వీడియో

అదరగొట్టిన కేరళ కుట్టీ అతుల్య రవి లేటెస్ట్ పిక్స్

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.