Most Recent

Alia Bhatt: ఎన్టీఆర్‌ సినిమా నుంచి అలియా ఔట్‌!.. క్లారిటీ ఇచ్చిన కొరటాల..

Ntr And Aliabhatt

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య (Acharya) ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ (JRNTR)తో జతకట్టనున్నారు ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సందడి చేసిన అలియాభట్‌ (Alia Bhatt) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందని మొదట వార్తలు వచ్చాయి. ఆతర్వాత వివిధ కారణాలతో ఎన్టీఆర్‌30 నుంచి తప్పుకుందన్న రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ (Koratala Shiva) . దీంతో పాటు ఎన్టీఆర్‌ 30 సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారాయన.

ఎన్టీఆర్ కే మాత్రమే వినిపించాను..

‘ ఆచార్య విడుదల తర్వాత స్వల్ప విరామం తీసుకొని ఎన్టీఆర్‌తో సినిమాను ప్రారంభిస్తాను. స్క్రిప్ట్ వర్క్‌ చాలా వరకు పూర్తైంది. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ను మళ్లీ చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌లో చూడబోతున్నారు. ఇంతకు మించి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను’ అని కొరటాల చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హీరోయిన్‌ గా అలియా భట్‌ నటిస్తోందా అన్న ప్రశ్నకు ‘ఇప్పటివరకు స్క్రిప్ట్‌ని కేవలం ఎన్టీఆర్‌కే మాత్రమే వినిపించాను. హీరోయిన్‌ విషయం గురించి అసలు చర్చకు రాలేదు. త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్‌, నటీనటులు, ఇతర టెక్నీషియన్ల గురించి చెబుతాం’ అని స్పష్టం చేశారు శివ. దీంతో ఈ ప్రాజెక్టుకి అలియా నో చెప్పిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

Karnataka: నిప్పులు జ‌ల్లుకునే జాత‌ర.. అగ్ని కేళి పేరుతో ఉత్సవాలు

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.